శోభాశెట్టి ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో గౌతమ్, అర్జున్!
on Nov 30, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారింది. నామినేషన్‌లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లలో సత్తాని చాటుతున్నారు. అమర్ దీప్ ఫ్యాన్స్ ఓటింగ్ షేర్‌తో ఈవారం ఓటింగ్ నిజంగానే ఉల్టా పుల్టా అయిపోయింది. అయితే గురు, శుక్రవారాల్లో జరిగే ఓటింగ్ కూడా ఎలిమినేషన్‌కి కీలకం కానుంది. ‘ఫినాలే అస్త్ర’ టాస్క్‌లో జరుగుతున్న హౌస్ మేట్స్ ఆటతీరు వల్ల ఓటింగ్‌లో కీలకమైన మార్పులు ఉండబోతున్నాయి. రోజు రోజుకి ఎలిమినేషన్ ఎవరనే లెక్కలు మారుతున్నాయి.
ఫినాలే అస్త్రని గెలుచుకోవడానికి కంటెస్టెంట్స్ ఎంత కసిగా ఆడుతున్నారో అందరికి తెలిసిందే. అయితే ఇందులో శోభాశెట్టి ఆదిలోని అవుట్ అయింది. ప్రియాంక అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుండటంతో ప్రియాంకకి ఓటింగ్ షేర్ పెరుగుతుంది.అయితే వీళ్ళిద్దరు ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ప్రియాంకకి ఓటింగ్ పెరిగితే శోభాశెట్టికి మూడినట్టే లెక్క. పైగా ఆమె ఈవారం ‘ఫినాలే అస్త్ర’లో డిస్ క్వాలిఫై అయ్యింది కాబట్టి.. టాస్క్‌లలో ఏదో పొడుస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆ ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు. అయితే శోభాశెట్టి ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతుల్లో లేనేలేదు. మేనేజ్‌మెంట్ కోటాలో ఆమెను బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్నారు. టేస్టి తేజ కంటే ముందు నుండి వరుసగా ప్రతీవారం లీస్ట్‌లో ఉన్న శోభాశెట్టిని సేవ్ చేస్తూ వస్తూనే ఉన్నారు బిగ్ బాస్. ఈమె ఎలిమినేషన్ పై ఇప్పటికే ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
శోభాశెట్టికి అగ్రిమెంట్ ఎన్నివారాలిచ్చారో ఎవరికి తెలియదు కాబట్టి ఈవారం కూడా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయడమనేది డౌటే. ఇన్ని వారాలు శోభాని కాపాడిరది చాలని బిగ్ బాస్ అనుకుంటే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం శోభాశెట్టిని ఎలిమినేషన్ చేస్తాడు. లేదంటే తనతో పాటు లీస్ట్‌లో ఉన్న అర్జున్ గౌతమ్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 ఫినాలేకి రెండు వారాలే ఉండటంతో ఈ వారం బిగ్ బాస్ శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తాడని, లేదంటే డేంజర్ జోన్‌లో ఉన్న ప్రియంకని ఎలిమినేట్ చేస్తాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
